అన్న ఐపీఎస్ అధికారి.. తమ్ముడు ఉగ్రవాది!

- July 08, 2018 , by Maagulf
అన్న ఐపీఎస్ అధికారి.. తమ్ముడు ఉగ్రవాది!

జమ్ముకాశ్మీర్‌లో ఓ ఐపీఎస్ అధికారి సోదరుడు హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరడం కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన అతను ఉగ్రవాదంవైపు ఆకర్షితుడు అయ్యుండొచ్చని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమని తేలింది.

ఈ ఏడాది మే 22న కాశ్మీర్ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి షంషల్ హక్ మెంగినూ అదృశ్యమయ్యాడు. ఇప్పుడు అతని ఫొటో హిజ్బుల్ వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. తుపాకీ చేతపట్టి ఫొటోకు ఫోజిచ్చాడు. కొత్తగా 12 మందిని రిక్రూట్ చేసుకున్నట్టు లిస్టు బయటకు రావడం.. అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 

కాశ్మీర్‌లోని సోపియాన్ ప్రాంతానికి చెందిన ఇనాముల్ హక్ ఐపీఎస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన దేశం కోసం అంకితభావంతో 2012లోనే సివిల్ సర్వీసెస్‌లోకి వస్తే.. సోదరుడు ఉగ్రవాదం వైపు మళ్లడం చర్చనీయాంశమైంది. అటు, హిజ్బుల్ రిలీజ్ చేసిన ఫొటో ప్రకారం షంషల్ హక్ మెంగినూకు బురాన్ సనీ పేరుతో ఓ కోడ్ నేమ్ ఉంది. మే 25న అతను తమ టీమ్‌లో చేరినట్టు హిజ్బుల్ ప్రకటించింది.

కొద్ది కాలంగా విద్యావంతులైన యువత కూడా టెర్రరిజంవైపు మొగ్గుతున్నారు. జమ్ముకాశ్మీర్ ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం ఈ ఏడాది 50 మంది పాక్ ప్రేరేపిత సంస్థల్లో చేరిపోయారు. ఈ పరిణామాలన్నీ లోయలో నెలకొన్న అశాంతికి అద్దం పడుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com