గంటల వ్యవధిలోనే అతి భారీవర్షం.. 85 మంది మృతి

- July 08, 2018 , by Maagulf
గంటల వ్యవధిలోనే అతి భారీవర్షం.. 85 మంది మృతి

ఎడతెరిపి లేని వర్షాలకు జపాన్‌లోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.  వరదల్లో చిక్కుకుని ఇప్పటివరకూ 85 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడడం కూడా మరణాలకు కారణమైంది. మరో 60 మంది ఆచూకీ తెలియడం లేదు. వేలాది ఇళ్లు వరదల ఎఫెక్ట్‌కి నేలమట్టం అయ్యాయి. దాదాపు  20 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. 

సహాయ చర్యల కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించినా లోతట్టు ప్రాంతాల్లో సాధరణ పరిస్థితి రావడానికి చాలా రోజులు పట్టేలా కనిపిస్తోంది. ప్రధాని షింజో అబే పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

గంటల వ్యవధిలోనే అతి భారీవర్షం కురవడం వల్ల పలు నగరాల్లో పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రస్తుతం సహాయ చర్యల కోసం ఆర్మీని రంగంలోకి దించారు. హెలీకాఫ్టర్ల సాయంతో బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కొచీ ప్రాంతంలోని సుకుమోలో రెండు గంటల వ్యవధిలో 26.3 సెం.మీ. వర్షం కురిసింది. అంటే దాదాపు 10 ఇంచుల మేర కుండపోతతో నగరంతా పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. ఇక మోటోయమా ప్రాంతంలో రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. ఏకంగా 24 గంటల్లో అక్కడ  583 మిల్లీ మీటర్లు, అంటే 23 ఇంచీల వర్షం కురిసింది. అటు, ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వానగండం తప్పినా.. పూర్తిగా నానిపోయిన కొండ చరియలు భయపెడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com