బహ్రెయిన్:పిల్లల తప్పిదం.. పెద్దలకు జరీమానా!
- July 09, 2018
బహ్రెయిన్:పబ్లిక్ పార్కులు, గార్డెన్స్‌లో ఇకపై పిల్లలు అక్కడి పరిసరాల్ని, వసతుల్ని డ్యామేజ్ చేస్తే వారి తల్లిదండ్రులు జరీమానా చెల్లించాల్సి రావొచ్చు. ఈ మేరకు నిబంధనల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముహర్రాక్ మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ మొహమ్మద్ అల్ సినాన్ మాట్లాడుతూ, పిల్లలు డ్యామేజ్ చేస్తే పెద్దలకు విధించే జరీమానా 50 దినార్స్ పైనే వుండేలా సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, డ్యామేజ్‌లకు పాల్పడే చిన్నారుల్ని గుర్తించాలన్నది తమ ప్లాన్ అని ఆయన వివరించారు. పిల్లలు, వసతుల్ని పాడు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన తల్లిదండ్రులు కొంత ఉదాసీనంగా వ్యవహరించడంతో పెద్దయెత్తున అక్కడ వసతులకు నష్టం కలుగుతోందనీ, తద్వారా అనవసరంగా అదనపు నిధులు వెచ్చించి వాటిని బాగు చేయాల్సి వస్తోందని నార్తరన్ మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ మొహమ్మద్ బౌహ్‌హౌద్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రపోజల్‌కి పౌరుల నుంచీ మద్దతు లభిస్తోంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!