షార్జా:మినీబస్‌ ప్రమాదం: ఏడుగురికి గాయాలు

- July 09, 2018 , by Maagulf
షార్జా:మినీబస్‌ ప్రమాదం: ఏడుగురికి గాయాలు

షార్జాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని అల్‌ ధైద్‌ హాస్పిటల్‌కి తరలించి, వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. వర్కర్స్‌ని ట్రాన్స్‌పోర్ట్‌ చేస్తోన్న మినీ బస్‌ ఓవర్‌ టర్న్‌ అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కన్‌స్ట్రక్షన్‌ సైట్‌కి కార్మికుల్ని ఈ వాహనం తరలిస్తోంది. ప్రమాదంలో వాహనం, రోడ్‌ బ్యారియర్‌ని ఢీకొని పలుమార్లు బోల్తా కొట్టింది. పోలీస్‌ ఆపరేషన్స్‌కి సమాచారం అందిన వెంటనే, ట్రాఫిక్‌ ఎక్స్‌పర్ట్స్‌.. పెట్రోల్స్‌, అంబులెన్సె సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. గాయపడ్డవారిలో ఓ కార్మికుడికి శస్త్ర చికిత్స నిర్వహించారు. గాయపడ్డవారిలో ఆసియా, అరబ్‌ దేశాలకు చెందిన కార్మికులున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com