యు.ఏ.ఈలో 51 డిగ్రీలకు చేరిన అత్యధిక ఉష్ణోగ్రత
- July 11, 2018
యూఏఈలో అత్యధి ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరుకుంది. సైహ్ అల్ సలెమ్లో 51 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, దేశంలోని నాలుగు స్థానాల్లో 50 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రత 27.7గా నమోదయ్యింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, వాతావరణం రానున్న రోజుల్లో మరింత వేడిగా వుంటుందని తెలుస్తోంది. ఈస్ట్వార్డ్లో కొంతమేర మేఘాలు ఏర్పడే అవకాశం వుంది. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. పలు ప్రాంతాల్లో ధూళి ఎక్కువగా వుంటుంది. వేడికి సమాంతరంగా హ్యుమిడిటీ కొనసాగుతుంది. సముద్ర తీర ప్రాంతాలు సాధారణంగానే కనిపిస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







