తప్పును సరిదిద్దుకున్నఇరాన్..భారత్ తలొగ్గుతోందంటూ..
- July 12, 2018
అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గుతోందని ఇరాన్ ఆరోపణలు చేసింది. చమురు దిగుమతిని తగ్గించుకుంటే ప్రత్యేక హక్కులు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించిన మరుసటి రోజే తన వాదనను వెనక్కు తీసుకుంది. ట్రంప్ ఆంక్షలతో భారత్ సహా చాలా దేశాలు ప్రభావితమవుతున్నాయని భారత్‌లో ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా తగ్గించుకోవాలని భారత్ సహా పలు దేశాలను అమెరికా ఆదేశించింది. నవంబర్ 4 నాటికి చమురు దిగుమతులు జీరో అవ్వాలని, లేకపోతే పలు ఆంక్షలు తప్పవని హెచ్చరికలు చేసింది. దీంతో ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ రాయబారి భారత్‌పై అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా తన తప్పును సరిదిద్దుకున్నారు. భారత్‌కు చమురు దిగుమతి విషయంలో తమ వంతు పాత్రను బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పారు. భారత్‌తో తమకు ఎప్పుడూ మంచి బంధాలే ఉన్నాయని ఇరాన్ రాయబారి క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







