అశృనయనాల మధ్య శరత్ అంత్యక్రియలు
- July 12, 2018
            అశృనయనాల మధ్య శరత్ అంత్యక్రియలు స్వగ్రామం కరీమాబాద్‌లో జరిగాయి... శరత్ భౌతిక కాయానికి మంత్రి కడియం శ్రీహరి నివాళులర్పించారు... అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు... శరత్ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి కడియం హామీ ఇచ్చారు...
అమెరికాలోని కాన్సాస్‌లో నల్లజాతీయుడి కాల్పుల్లో మృతిచెందిన కొప్పు శరత్ అంత్యక్రియలు అతని స్వగ్రామం వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో అశృనయనాల మధ్య పూర్తయ్యాయి... సుదీర్ఘ నీరీక్షణ తరువాత హైదరాబాద్ చేరుకున్న శరత్ భౌతిక కాయాన్ని.. వరంగల్ జిల్లా కరీమాబాద్‌కు కుటుంబ సభ్యులు తరలించారు. శరత్ భౌతిక కాయానికి మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే కొండా సురేఖ్, వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్లు నివాళులర్పించారు. శరత్ అంతిమయాత్రలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాంతినగర్ స్మశాన వాటికలో శరత్‌కు.. కుటుంబ సభ్యులు.. స్నేహితులు కన్నీటి వీడ్కోలు పలికారు.
కొప్పు రామ్మోహన్, మాలతి దంపతులకు శరత్ ఏకైక కుమారుడు. ఎం.ఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన శరత్ కాన్సాస్‌లో ఎంఎస్ చేస్తూ.. ఓ రెస్టారెంట్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడు. గత శుక్రవారం సాయంత్రం డ్యూటీలో ఉండగా ఓ వ్యక్తి రెస్టారెంట్‌లోకి వచ్చి గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయంతో రెస్టారెంట్ సిబ్బందితో పాటు ముగ్గురు కస్టమర్ టేబుళ్ల కింద దాక్కున్నారు. శరత్ మాత్రం భయంతో పరుగులు తీయటంతో.. నిందితుడు శరత్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆస్పత్రికి తరలించగా.. శరత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆరు రోజుల తరువాత శరత్ భౌతిక కాయం హైదరాబాద్ చేరుకోవడం అక్కడి నుంచి వరంగల్ జిల్లా కరీమాబాద్‌కు తరలించారు... బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య శరత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి... మృతదేహం అమెరికా నుంచి తెప్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







