సవాళ్ళను ఎదుర్కొంటున్న 'సాక్ష్యం'
- July 12, 2018
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ హిట్ రాకపోయినా వరసగా భారీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ నేపపధ్యంలో ఈ నెల 27న విడుదల అవుతున్న 'సాక్ష్యం' సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు బెల్లంకొండ. ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ అందర్నీ ఆకర్షిస్తున్న నేపధ్యంలో ఈమూవీ పై ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ నడుస్తోంది.
అయితే ఈ సినిమాను టార్గెట్ చేస్తూ మెగా అక్కినేని కుటుంబాలకు చెందిన రెండు సినిమాలు పోటీ పడుతూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. నిహారిక సుమంత్ అశ్విన్ లు జంటగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ అదేవిధంగా సుశాంత్ హీరోగా నటించిన అన్నపూర్ణ స్టూడియోస్ 'చి.ల.సౌ.' ఇదే డేట్ ను టార్గెట్ చేస్తూ విడుదల అవుతూ బెల్లంకొండను ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.
పేరుకు ఈ సినిమాలు చిన్న సినిమాలే అయినా వీటి వెనుక ఇండస్ట్రీ పెద్ద కుటుంబాలు ఉండటంతో ఈ మూడు సినిమాల మధ్య పోటీ ధియేటర్స్ వార్ కు తెర తీస్తోంది. చిన్న సినిమాలలో పెద్ద సినిమాగా మారిన 'సాక్ష్యం' మూవీ పై భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు.
తెలుస్తున్న సమాచారం మేరకు 'సాక్ష్యం' సినిమాకు 40 కోట్ల బిజినెస్ జరిగింది అని వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఈసినిమాకు ఇంత సీన్ ఉందా అంటూ చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ చిత్ర నైజాం హక్కుల్ని 7 కోట్లకు కొనుకున్నాడు అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ మాన్ సూన్ ఫైట్ విజేత ఎవరు అనే విషయం పై ఇండస్ట్రీ వర్గాలలో అంచనాలు పెరుగుతున్నాయి..
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







