యూఏఈలో ఇండియన్ రెస్టారెంట్ మూసివేత
- July 12, 2018
అబుదాబీ ఫుడ్ కంట్రోల్ అథారిటీ, ఓ ఇండియన్ రెస్టారెంట్‌ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంజప్పార్ చెట్టినాడ్ రెస్టారెండ్ మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అల్ ఖాలిదియాలోని ఈ రెస్టారెంట్ హెల్త్ మరియు సేఫ్టీ విభాగాల్లో నిబంధనలకు తగిన విధంగా లేదని అధికారులు నిర్ధారించి, మూసివేశారు. ఎడిఎఫ్సిఎ అధికార ప్రతినిథి థామెర్ అల్ కాసిమి మాట్లాడుతూ, పలు మార్లు హెచ్చరించినా నిర్వాహకులు తీరు మార్చుకోకపోవడంతో రెస్టారెంట్‌ని మూసివేయాల్సి వచ్చిందని చెప్పారు. ఫ్లోర్, సీలింగ్, ఇతర ఎక్విప్మెంట్స్, రిఫ్రిజిరేటర్స్.. ఇవేవీ క్లీన్‌గా లేవని అధికారులు పేర్కొన్నారు. పెస్ట్ కంట్రోల్ సరిగ్గా చేయకపోవడంతో అక్కడ పరిస్థితులు దారుణంగా వున్నాయని వారు వివరించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







