వీకెండ్ వెదర్: యూఏఈలో వేడి మరింత తీవ్రం
- July 12, 2018
రానున్న రోజుల్లో వాతావరణం మరింత వేడిగా మారబోతోంది. ఇప్పటికే 50 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని వాతవరణ శాఖ హెచ్చరించింది. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం కొన్ని చోట్ల మేఘావృతమైనప్పటికీ, మొత్తంగా వాతావరణం వేడిగా వుంటుందని తెలుస్తోంది. గాలుల తీవ్రత సాధారణం నుంచి ఓ మోస్తరుగా వుంటుంది. వీకెండ్లో బయటి ప్రదేశాల్లో విహరించాలనుకునేవారికి వాతావరణం ఇబ్బందికరంగానే మారుతుంది. 51 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరనున్న దరిమిలా డీ హైడ్రేషన్‌కి గురయ్యే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. డస్ట్ ఎక్కువగా వుండడం, దానికి గాలులు తోడవడంతో విజిబిలిటీ తక్కువ వుంటుంది గనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







