రష్యా క్షిపణికొనుగోళ్లపై ఆంక్షల ప్రభావం నిల్‌

- July 14, 2018 , by Maagulf
రష్యా క్షిపణికొనుగోళ్లపై ఆంక్షల ప్రభావం నిల్‌

న్యూఢిల్లీ: రష్యాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ రక్షణరంగానికి సంబం ధించిన ఎస్‌-400 వైమానిక క్షిపణుల కొనుగోలు డీల్‌ కొనసాగుతుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. రష్యాపై అమెరికా మిలిటరీ ఆంక్షలువిధించినా ఈ రక్షణరంగ క్షిప ణుల డీల్‌ మాత్రం ముందుకువెళుతుందని మంత్రి వెల్లడించారు. ఆంక్షల చట్టం ప్రకారం అమెరికా నుంచి ప్రతికూలతలు ఉననప్పటికీ ఆచట్టం అమెరికా చట్టమని, ఐక్యరాజ్యసమితి చట్టంకాదని, భారత్‌ తనవైఖరిని ఇప్పటికే అమెరి కాకు స్పష్టంచేసిందని అన్నారు. భారత్‌ రష్యా రక్షణ సంబంధాలు కొనసాగుతాయని, అనేక దశాబ్దాలనుంచి పటిష్టంగా ఉన్నాయన్నారు. అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందానికి భారత్‌ తన రష్యా క్షిపణుల కొనుగోలువైఖరిని స్పష్టం చేసిందని గుర్తుచేసారు. రష్యాతో ఎస్‌.400 క్షిప ణుల డీల్‌ ముగింపుదశకు వచ్చిందని అన్నారు. రెండున్నర లేదా నాలుగేళ్లలో ఎస్‌- 400 క్షిపణులు భారత్‌కు అందుతాయని ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com