ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న తొలి అరబ్ దేశం
- July 15, 2018
మాస్కో: నెల రోజుల నుంచి సాకర్ అభిమానులను అలరిస్తున్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి తెరపడింది. మొత్తం 32 జట్లు ఎనిమిది గ్రూపులుగా విడిపోయి కలపడ్డ ప్రపంచకప్ దిగ్విజయంగా ముగిసింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా అశేష అభిమానుల మద్దతు మధ్య సాఫీగా సాగింది. ఫ్రాన్స్, క్రొయేషియా ఫైనల్ మ్యాచ్‌కు దేశ అధికారిక భవనం క్రెమ్లిన్‌లో ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో సమక్షంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఖతార్ రాజు షేక్ తమీమ్‌బిన్ హమద్‌ఆల్ థనీకి 2022 ప్రపంచకప్ టార్చ్‌ను అందించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ రష్యా వేదికగా ప్రపంచకప్ టోర్నీ విజయవంతంగా ముగిసింది. మా మిత్రదేశమైన కతార్‌లోనూ 2022 సంవత్సరంలో సక్సెక్ కావాలని ఆశిస్తున్నా అని అన్నారు. మరోవైపు ఫిఫా ప్రపంచకప్ మా దేశానికి పెద్ద పండుగ లాంటిది అని ఖతార్ రాజు అన్నారు. ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న తొలి అరబ్ దేశంగా ఖతార్ రికార్డుల్లోకెక్కింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







