నరేంద్ర మోదీ వీసా రికార్డులను అమెరికా ముందు ఉంచాలని ఆదేశం
- December 12, 2015
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీసాకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని అమెరికా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మోదీ అమెరికా రాకుండా విధించిన నిషేధం ఎత్తివేస్తూ బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా సమర్పించాలని పేర్కొంది. 2016, జనవరి నెల మధ్యలో ప్రాథమిక నివేదిక సమర్పించాలని న్యూయార్క్ సదరన్ డిస్టిక్ట్ జడ్జి జాన్ కొయల్ టెల్ ఈ నెల 9న ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 29కు వాయిదా వేశారు. సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నరేంద్ర మోదీ వీసా, అమెరికాలో ఆయన ప్రవేశానికి సంబంధించిన రికార్డులు (2013 జూన్ నుంచి) ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎస్ఎఫ్జే కోర్టును ఆశ్రయించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







