దుబాయ్:'సైమా 2018' అవార్డుల వేడుకకు రంగం సిద్ధం
- July 16, 2018
దుబాయ్:ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల వేడుక ఇటీవలే కన్నుల పండువగా ముగిసిన సంగతి తెలిసిందే. త్వరలో సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక ప్రారంభం కాబోతోంది. 7వ ఎడిషన్ సైమా అవార్డుల వేడుక ఈ సారి దుబాయ్‌లో ప్లాన్ చేస్తున్నారు.
'సైమా' నిర్వాహకులు వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 7, 8వ తేదీల్లో దుబాయ్‌లో వైభవంగా ఈ అవార్డుల వేడుక జరుగనుంది. కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
ఈ అవార్డుల వేడుకలో వివిధ కేటగిరీల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులు ప్రధానం చేయబోతున్నారు. దీంతో పాటు సినీ రంగానికి విశిష్ఠ సేవలు అందించిన ప్రముఖులను సత్కరించనున్నారు. సౌత్‌లోని నాలుగు సినిమా పరిశ్రమలకు చెందిన తారలతో కలర్ ఫుల్‌గా ఈ వేడుక జరుగనుంది.
గతంలో నిర్వహించిన సైమా వేడుకలను తలదన్నేలా ఈ 7వ ఎడిషన్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. అన్ని సినిమా రంగాల నుండి పెద్ద పెద్ద స్టార్లు ఈ వేడుకకు హాజరయ్యేలా నిర్వాహకులు దృష్టి పెట్టారు. త్వరలోనే పూర్తి వివరాలు దినేష్ కుమార్ ఉగ్గిన(అంజన్ స్టార్ ఈవెంట్స్,ఎం.డి) వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







