ట్రంప్, పుతిన్ కీలక భేటీ!!.
- July 16, 2018
హెల్సింకి : చిరకాల ప్రత్యర్థులైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా, అమెరికాల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి ఈ సమావేశం దోహదపడనుందని క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి. రష్యాతో సంబంధాలు చెడిపోవడానికి ఎఫ్‌బిఐ కారణమని ట్రంప్ సమావేశానికి ముందు ఆరోపించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు ఎఫ్‌బిఐ బాధ్యత వహించాలని ట్రంప్ అన్నారు. రష్యాతో సంబంధాలు అధ్వానంగా ఉండటానికి అమెరికా పిచ్చితనం, మూర్ఖత్వమే కారణమని ట్రంప్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. సిరియా అంతర్యుద్ధం, ఉక్రెయిన్, అమెరికా ఎన్నికల్లో జోక్యం, అణు విస్తరణ, తదితర అంశాలపై పుతిన్‌తో చర్చించనున్నట్లు ట్రంప్ చెప్పారు. ప్రపంచంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం దోహదపడుతుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







