మహిళా పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న సౌదీ ఏవియేషన్ అకాడమీ
- July 18, 2018
దమ్మమ్: ఆక్స్‌ఫోర్డ్ ఏవియేషన్ అకాడమీ,ఇప్పటికే వందలాది అప్లికేషన్లను స్వీకరించింది సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న కొత్త బ్యాచ్ శిక్షణ కోసం. ఈస్టర్న్ సిటీ ఆఫ్ దమ్మమ్‌లోని న్యూ బ్రాంచ్‌లో ఈ శిక్షణ ప్రారంభమవుతుంది. ఏవియేషన్‌లో శిక్షణ కోసం విదేశాలకు వెళుతున్నారనీ, మహిళలకు ఈ క్రమంలో చాలా ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయని దలాల్ యషార్ అనే అప్లికెంట్ చెప్పారు. ఇకపై అలాంటి కష్టాల నుంచి తమకు ఇబ్బందులు తొలగుతాయని ఆమె అభిప్రాయపడుతోంది. స్కూల్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ మెయిన్‌టెనెన్స్ మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఫ్లైట్ సిమ్యులేటర్స్ తదితర ప్రాజెక్టులతో 300 మిలియన్ డాలర్ల ప్రాజెక్టులో ఈ అకాడమీ కూడా ఓ భాగం. స్టూడెంట్స్‌కి మూడేళ్ళ అకడమిక్ అలాగే ప్రాక్టికల్ ట్రెయినింగ్ వుంటుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒత్‌మాన్ అల్ మౌటైరి చెప్పారు. ఇటవలే మహిళలు సొంతంగా వాహనాలు నడిపేందుకు కింగ్‌డమ్‌లో అవకాశం లభించగా, ఇకపై మహిళలు పైలట్లుగా రాణించేందుకు అవకాశాలు కలుగుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







