హైదరాబాద్:కరక్కాయల కేసులో కొత్త కోణాలు

- July 19, 2018 , by Maagulf
హైదరాబాద్:కరక్కాయల కేసులో కొత్త కోణాలు

కరక్కాయల స్కాంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంత ఎక్కువ మందితో పొడి చేయిస్తే అంత ఎక్కువ లాభాలు అంటూ ప్రచారం చేయడంతో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరిగింది. బాధితులంతా పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నారు. మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. మొన్నటి వరకూ 5 కోట్ల రూపాయల స్కాం అన్నారు. కానీ బాధితుల సంఖ్య 600 నుంచి 700 వరకు ఉండడంతో 7 కోట్ల వరకూ స్కాం వెళ్లింది. కస్టమర్లకు ఓ ఐటీ నెంబర్‌ కేటాయించి, ఎక్కువ మందిని చేర్చుకోవడం ద్వారా కంపెనీ టర్నోవర్‌ను ఎంత పెంచితే లాభాలు అంతగా పెంచుకోవచ్చని, మీ కింద చేరిన సభ్యులకు లాభాల్లో వాటా ఉండదని, వాళ్లకు కేజీకి 300 చెల్లిస్తే చాలంటూ బుకాయించారు. 

ఈ ఆఫర్‌ నచ్చడంతో బాధితులు తమకు తెలిసిన వారిని పదుల సంఖ్యలో సభ్యులుగా చేర్పించారు. లక్షల్లో డబ్బులు వసూలు చేసి తమ పూచీకత్తుపై కంపెనీలో ఒక్కో బాధితుడు 2 లక్షల నుంచి 25 లక్షల వరకు డిపాజిట్‌ చేయించారు. వారికి సాఫ్ట్‌ ఇంటర్‌గ్రేడ్‌ మల్టీటూల్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ పేరుతో ధృవపత్రాన్ని, ఆ కంపెనీకి ప్రభుత్వ అనుమతి ఉందంటూ ఓ రిజిస్ట్రేషన్‌ పేపర్  ఇచ్చి నిర్వాహకులు బురిడీ కొట్టించారు. 

కరక్కాయల కంపెనీలో మేనేజర్‌గా పనిచేసిన మల్లికార్జున్‌, సంస్థ అధినేతగా చెప్పుకున్న దేవరాజ్‌ అనిల్‌కుమార్‌ స్వస్థలం నెల్లూరుగా తేలింది. వారి కోసం 2 బృందాలు గాలిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com