ఈ నెల 23 నుంచి మోదీ విదేశీ పర్యటన
- July 20, 2018
న్యూఢిల్లీ, జూలై 20: బ్రిక్స్ సమ్మిట్‌లో హాజరయ్యే నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం రువాండా, ఉగండా, దక్షిణాఫ్రికా దేశాలను సందర్శించనున్నారు. అంతర్జాతీయ శాంతి, రక్షణ విషయాలను ఈ సమావేశంలో చర్చకు వస్తాయని భావిస్తున్నారు. ఈనెల 23 నుంచి 27 మధ్య ప్రధాని మూడు దేశాలలో పర్యటిస్తారు. మొదట ర్వండాలో ఆ దేశాన్ని సందర్శించే మొదటి భారత ప్రధానిగా మోదీ రెండు రోజులు పర్యటించనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ ప్రతినిధి టిఎస్ త్రిమూర్తి తెలిపారు. తర్వాత ప్రధాని ఈనెల 24న ఉగండా వెళ్తారు. అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు పయనమవుతారు. అక్కడ జోహన్స్‌బర్గ్‌లో జరిగే జరిగే 10వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. అక్కడ అంతర్జాతీయ సమస్యలపై చర్చిస్తారు. ముఖ్యంగా అంతర్జాతీయ శాంతి, రక్షణ, వాణిజ్యం, గ్లోబల్ గవర్నెన్స్ తదితర అంశాలు ఇందులో చర్చిస్తారని భావిస్తున్నారు. అలాగే ప్రధాని మోదీ అక్కడి నాయకులతో ఆ దేశాలతో సంబంధాలు, ఇతర విషయాలపై సమావేశమవుతారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పిగ్‌తో దైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారా అన్న ప్రశ్నపై త్రిమూర్తి మాట్లాడుతూ ఈ సమయంలో తాము చైనాతోనే కాదు ఏ దేశంతోనూ దైపాక్షిక చర్చలు జరపమని చెప్పారు. కాగా, ర్వండా దేశ పర్యటనలో ఇరుదేశాల మధ్య రక్షణ సహకారంపై ఒప్పందం జరగవచ్చునని భావిస్తున్నామన్నారు. అలాగే ఆ దేశ పౌరులకు భారత్ తరఫున ఆవులను బహుమతిగా ఇస్తారని చెప్పారు.
థర్డ్‌పార్టీ బీమా ఉండాల్సిందే
* లేకపోతే వాహనాలు విక్రయించొద్దు * సెప్టెంబర్ 1 డెడ్‌లైన్: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, జూలై 20: నాలుగు, రెండు చక్రాల వాహనాల అమ్మకాలపై సుప్రీం కోర్టు కఠినమైన షరతులు విధించింది. థర్డ్‌పార్టీ ఇన్స్యూరెన్స్‌ను కచ్చితంగా చేయించాలని, అలాచేయించని పక్షంలో సెప్టెంబర్ 1 నుంచి వాహనాలు విక్రయాలు నిలిపివేయాలని ఆటోమొబైల్ కంపెనీలను ఆదేశించింది. థర్డ్‌పార్టీ ఇన్స్యూరెన్స్ రెండేళ్లు, ఐదేళ్లకు కచ్చితంగా చేయించాలని కోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణ సందర్భంగా కోర్టుకు సహాయకునిగా నియమితుడైన గౌరవ్ అగర్వాల్ మాట్లాడుతూ కార్లు లేదా బైక్‌లు కొనుగోలు సందర్భంలో మొదటిసారి మాత్రమే థర్డ్‌పార్టీ ఇన్స్యూరెన్స్ చేయిస్తున్నారని తెలిపారు. మరుసటి ఏడాది నుంచి దాని విషయమే పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. దేశంలో 66 శాతం వాహనాలకు థర్డ్‌పార్టీ ఇన్స్యూరెన్స్ ఉండడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరవై ఏళ్లకు ఒకేసారి థర్డ్‌పార్టీ బీమా చేయించడం సాధ్యంగాదని బీమా కంపెనీలు వాదిస్తున్నాయి. దీంతో థర్డ్‌పార్టీ ఇన్స్యూరెన్స్ కార్లకు రెండేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్లకు చేయించాలని స్పష్టం చేసింది.
అలాగే రక్షణ, తోలు, వ్యవసాయం, కల్చర్ తదితర విభాగాలలో కూడా ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదురుతాయని చెప్పారు. 1997 తర్వాత ఉగండాను దర్శించనున్న భారత్ ప్రధానిగా మోదీ నిలుస్తారని చెప్పారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు యొవేరీ ముసేవనితో చర్చలు జరుపుతారన్నారు. మోదీ ఉగండా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించి, ఈ ఘనత సాధించనున్న మొదటి ప్రధానిగా నిలుస్తారని చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!