రోడ్డు ప్రమాదంలో ఎమిరేటీ ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి
- July 21, 2018
23 ఏళ్ళ యువ ఫుట్‌బాల్ ప్లేయర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అల్ దఫ్రా వెస్టర్న్ రీజియన్‌లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మొహమ్మద్ అబ్దుల్లా అల్ హమ్మాదీ అల్ దఫ్రా ఫుట్‌బాల్ తొలి టీమ్‌లో డిఫెండర్‌గా సేవలందించాడు. రోడ్డు ప్రమాద ఘటన తమను తీవ్రంగా కలచివేసిందనీ, సహచరుడ్ని కోల్పోయిన ఆవేదనలో క్లబ్ మెంబర్స్ వున్నారని క్లబ్ వెల్లడించింది. సిటీ బేస్డ్ అల్ జజిరా ఫుట్‌బాల్ క్లబ్ నుంచి అల్ దఫ్రా క్లబ్‌కి వెళ్ళాడు మొహమ్మద్ అబ్దుల్లా. అల్ దఫ్రా, అల్ జజిరా, యూఏఈ అరేబియన్ గల్ఫ్ లీగ్‌లో భాగమే. యూఏఈ ప్రో లీగ్ కమిటీ, మొహమ్మద్ అబ్దుల్లా మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







