పుతిన్ బహుమతిని తనిఖీ చేస్తాం - అమెరికా నిఘా సంస్థ
- July 22, 2018
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ బహుమతిగా ఇచ్చిన ఫుట్‌బాల్‌ను కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తామని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్స్ తెలిపారు. ఇటీవల ట్రంప్-పుతిన్‌లు ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సిరియా అంశంలో ఉమ్మడి సహకారంపై ట్రంప్ మాట్లాడుతుండగా.. ఓ మీడియా ప్రతినిధి కల్పించుకొని ఒక వేళ 'బంతి రష్యా కోర్టులో ఉందా..?' అని పుతిన్‌ను అడిగాడు. దీనికి పుతిన్ స్పందిస్తూ '' వాస్తవానికి మేము వరల్డ్ కప్‌ను విజయవంతంగా పూర్తి చేశాం అని ఇప్పుడే ట్రంప్ చెప్పారు. '' అని అన్నారు. వేదిక పక్కకు వెళ్లి 2018 వరల్డ్ కప్ సాకర్ బాల్ ఒకటి తీసుకొచ్చి'' మిస్టర్ ప్రెసిడెంట్ ఈ బంతిని మీకు ఇస్తున్నాను. బాల్ ఇప్పుడు మీ కోర్టులో ఉంది.' అంటూ దానిని ట్రంప్‌కు అందజేశారు. బంతిని అందుకున్న తర్వాత ట్రంప్ స్పందిస్తూ '' ఇది మా అబ్బాయి బారన్ (12) వద్దకు వెళుతుంది.'' అని కింద ఉన్న సహాయకుల వైపునకు విసిరారు. ఈ ఘటనపై అమెరికా సెనెటర్ లిండ్సే గ్రహం స్పందిస్తూ '' అదే నేను అయితే ఆ బంతిలో ఏమైనా వినికిడి సాధనాలను అమర్చారేమో వెతుకుతాను. ఈ బంతిని వైట్‌హౌస్‌లోకి ఎప్పటికీ అనుమతించను.'' అని పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడి భద్రతా వ్యవహారాలను చూసే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ స్పందించింది.
అధ్యక్షుడికి వచ్చే ప్రతి బహుమతికి భద్రతా పరమైన తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఘటనకు ఒక్కరోజు ముందు పుతిన్ ఇటువంటి బంతినే ఖతార్ రాజుకు అందజేశారు. 2022 ప్రపంచకప్‌కు ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2026లో అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ప్రపంచకప్‌ను నిర్వహించనున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







