కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్ధిగా రాహుల్‌

- July 22, 2018 , by Maagulf
కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్ధిగా రాహుల్‌

2019 ఎన్నికలకు రంగస్థలాన్ని సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్‌. వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్ధి రాహుల్‌ గాంధి అని ప్రకటించింది. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు ఎళ్తామని క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీలో జరిగిన సీడబ్యూసీ విస్తృతస్థాయి సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై నేతలు చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ప్రీ-అలయెన్స్‌, పోస్ట్‌-అలయెన్స్‌పై నిర్ణయాధికారాన్ని రాహుల్‌కే అప్పగిస్తూ సీడబ్యూసీ నిర్ణయించింది. రాష్ట్రల అవసరాలకు అనుగుణంగా పొత్తులను ఖరారు చేసుకోనుంది కాంగ్రెస్‌. పొత్తులపై స్పష్టతకు ఓ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు రాహుల్‌ ప్రకటించారు. 

పార్టీలో క్రమశిక్షణపై కూడా సీడబ్ల్యూసీ నేతలు చర్చించారు.  అన్ని వర్గాలకు న్యాయం చేసేలా తమ కార్యచరణ ఉండబోతుందని ప్రకటించిన కాంగ్రెస్‌...అందుకు తగిన కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. అయితే..పెద్ద లక్ష్యాల వైపు జరుగుతున్న పోరాటంలో ఎవరైనా తప్పుడు ప్రకటనలు చేసినా..భాషలో పరుష పదజాలాన్ని వాడినా సహించేది లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com