రైతుబంధు చెక్ ను రైతు సమన్వయ సమితికి ఇచ్చిన TRS ఖతర్ ఉపాధ్యక్షుడు శోభన్ బందారపు

- July 23, 2018 , by Maagulf

రైతు బంధు చెక్ లను తిరిగి ఇవ్వగలరన్న అని ఎన్నారైలకు TRS NRI కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారి పిలుపు మేరకు  ఈ రోజు టి ఆర్ ఎస్ ఖతర్ ఉపాధ్యక్షుడు శోభన్ బండారపు  గారు సూర్యాపేట జిల్లా లోని నాగారం గ్రామంలో తన కుటుంబానికి ఉన్న  భూమికి వచ్చిన చెక్ ను  తన అన్న బందారపు వెంకన్న చేతులమీదిగా  మంత్రి జగ దీ శ్వ ర్ రెడ్డి గారి సమక్షంలో తుంగతూర్తే  శాసన సభ్యులు శ్రీ గాదరి కిషోర్ కుమార్ రైతు సమన్వయ సమితికి ఇవ్వడం జరిగింది.దేశంలోని ఏ రాష్ట్రం లో  ఇలాంటి పథకం అమలులో లేదని దీనిని తెలంగాణ రాష్ట్రం అమలు చేసినందుకు సీఎం కెసిఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ,విదేశాలలో స్థిరపడ్డ ఎన్నారైలు కూడా ఇదే విధంగా వారి పెట్టుబడిని తిరిగి ఇచ్చి తెరాస ప్రభుత్వానికి,రైతన్నకు అండగా నిలవాలని మల్లి పిలుపునిచ్చారు.

రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి, కతార్)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com