అధికారులపై హత్యాయత్నం: ఆరుగురిపై విచారణ
- July 23, 2018పోలీసు అధికారుల్ని చంపేందుకు యత్నించారంటూ ఆరుగురు యువకులపై కేసులు నమోదవగా, ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. నిందితులంతా 16 నుంచి 26 ఏళ్ళ మధ్య వయసున్న యువకులే. నువైద్రాత్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాస్క్లు ధరించిన 20 నుంచి 25 మంది ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆందోళనల్ని అడ్డుకునేందుకు వెళ్ళిన తమపై దాడి చేశారనీ, ఈ క్రమంలో ఓ బాంబు పేలుడు సంభవించిందనీ, ఓ అధికారి గాయపడ్డారని, పెట్రోల్ కార్ డ్యామేజ్ అయ్యిందని అధికారులు వివరించారు. గాయపడ్డ పోలీసు అధికారిని, మిగతా సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 8 ఫైర్ బాంబులు, 22 బాటిల్స్ (మోలోటోవ్ కాక్టెయిల్స్ కోసం వినియోగించేవి) స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







