రెండు డయాబెటిస్ మెడిసిన్స్ మార్కెట్ నుంచి ఉపసంహరణ
- July 23, 2018
మార్కెట్ నుంచి బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేసే రెండు రకాలైన మందుల్ని ఉపసంహరించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులెవరూ ఆ మందుల్ని వినియోగించరాదని అధికారులు పేర్కొన్నారు. గ్లైనేజ్ 5 ఎంజీ, అలాగే డయాటాబ్ 5 ఎంజీ ట్యాబ్లెట్లపై నిషేధం వుంది. హెల్త్ కన్సర్న్స్ నేపథ్యంలో వీటిపై నిషేధం విదించారు. టైప్ 2 డయాబెటిస్‌కి ఈ మందుల్ని ఇప్పటిదాకా వినియోగించారు. ఈ మందు తాలూకు కంపోజిషన్‌పై వివాదాలు వచ్చాయి. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఇటీవలే ఈ ప్రోడక్ట్‌ని మార్కెట్ నుంచి ఉపసంహరించడంతోపాటు, వినియోగదారులనూ ఈ మందులు కొనుగోలు చేయొద్దని హెచ్చరించింది. నేషనల్ హెల్త్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ తాజాగా ఈ మందులపై నిషేధం ప్రకటించింది. నిషేధించిన మందుల్ని ఎవరైనా విక్రయిస్తున్నట్లయితే మినిస్ట్రీకి ఫిర్యాదు చేయాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..