గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కు దేవాలయాల నుండి మంచి స్పందన!
- December 13, 2015
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కు దేవాలయాల నుండి మంచి స్పందన వస్తుంది. ఇటీవలే సిద్ధి వినాయక దేవాలయం 40 కేజీల బంగారాన్ని ఈ పథకం కింద డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకోగా తాజాగా షిరిడీ సాయి బాబా ఆలయం నిర్వాహకులు ఇదే బాటలో పయనించాలని భావిస్తున్నారు. అయితే షిరిడీ సాయి దేవాలయ నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో.. 200 కేజీల బంగారాన్ని ఈ స్కీమ్ కింద డిపాజిట్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయానికి గతంలో బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పు అడ్డంకిగా ఉంది. భక్తులు సమర్పించుకున్న బంగారాన్ని కరగదీయొద్దని గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా బంగారాన్ని డిపాజిట్ చేసే విధంగా కోర్టు నుండి అనుమతులు పొందడానికి పిల్ దాఖలు చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. బంగారంపై వచ్చిన వడ్డీని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని, కోర్టు నుండి అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే షిరిడీ ఆలయంలోని బాబా విగ్రహంపై ఉన్నటువంటి 180 కేజీల బంగారాన్ని మాత్రం అలాగే ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు. అది కాకుండానే 200 కిలోల బంగారం షిరిడీ ఆలయానికి ఉంది. బంగారానికి భద్రత ఏర్పాట్లు చేయడంఆలయ నిర్వాహకులకు తలకు మించిన భారంగా మారిన నేపథ్యంలో గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







