సెప్టెంబర్‌లో ప్రారంభానికి సిద్ధమవుతున్న సోహార్‌ డ్రగ్స్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌

- July 24, 2018 , by Maagulf
సెప్టెంబర్‌లో ప్రారంభానికి సిద్ధమవుతున్న సోహార్‌ డ్రగ్స్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌

మస్కట్‌: సోహార్‌లో నిర్మాణంలో వున్న డ్రగ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ పనులు 97 శాతం పూర్తయ్యాయి. 1 మిలియన్‌ ఒమన్‌ రియాల్స్‌ ఖర్చుతో దీన్ని నిర్మిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, సోహార్‌ మునిసిపాలిటీతో కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టింది. ఈ ఏడాది చివరి క్వార్టర్‌ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు వేగవంతంగా చేస్తున్నారు. సెప్టెంబర్‌ నాటికి ప్రాజెక్ట్‌ పూర్తవుతుందనీ, అదే నెలలో ప్రారంభం కాబోతోందని అధికారులు పేర్కొన్నారు. సోహార్‌ మునిసిపాలిటీ, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ంటర్నల్‌ ఎక్విప్‌మెంట్‌ని అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ మొత్తం ఖర్చు 1,611,100 ఒమన్‌ రియాల్స్‌. ఆర్పిక్‌, సోహార్‌ అల్యూమినియం మరియు వేల్‌ కంపెనీస్‌ ఈ ప్రాజెక్ట్‌లో భాగం పంచుకుంటున్నాయి. 3,502.16 చదరపు మీటర్ల వైశాల్యంలోని ఈ సెంటర్‌, డ్రగ్‌ డిపెండెంట్స్‌కి సేవలందిస్తుంది. డ్రగ్స్‌ వల్ల తలెత్తే దుష్ప్రరిణామాలపై ప్రచారం చేస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com