మునిగిపోతున్న బోటు నుంచి ఆరుగుర్ని రక్షించిన కోస్ట్‌గార్డ్‌

- July 24, 2018 , by Maagulf
మునిగిపోతున్న బోటు నుంచి ఆరుగుర్ని రక్షించిన కోస్ట్‌గార్డ్‌

కువైట్‌: ఫైలకా నుంచి సాల్మియాకు వెళుతూ ఓ బోటు మునిగిపోగా, సకాలంలో స్పందించిన కోస్ట్‌గార్డ్‌, సీ రెస్క్యూమెన్‌ ఆ బోటు నుంచి ఆరుగుర్ని రక్షించారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మినిస్ట్రీకి చెందిన రిలేషన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ వివరాల్ని వెల్లడించింది. మరో కేసులో కోస్ట్‌గార్డ్‌, ఈత కొడుతూ మునిగిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. మునిగిపోతున్న వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని అందుకున& అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాన్ని వెలికి తీశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com