వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం: వలసదారుడి మృతి

- July 25, 2018 , by Maagulf
వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం: వలసదారుడి మృతి

మస్కట్‌: ఆసియా జాతీయుడైన వలసదారుడొకరు ఫర్నిచర్‌ వేర్‌హౌస్‌లో తలెత్తిన అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ (పిఎసిడిఎ) వెల్లడించింది. అల్‌ బతినా గవర్నరేట్‌ పరిధిలోని విలాయత్‌ ఆఫ్‌ బర్కాలోని ఓ వేర్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలో ఆస్థి నష్టం కూడా తీవ్రంగానే సంభవించిందని పిఎసిడిఎ పేర్కొంది. అథారిటీకి చెందిన ఐదు బ్రిగేడ్స్‌ సంగటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అథారిటీ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com