'స్త్రీ' ట్రైలర్ విడుదల

- July 27, 2018 , by Maagulf
'స్త్రీ' ట్రైలర్ విడుదల

శ్రద్ధా కపూర్‌..'స్త్రీ' ట్రైలర్ విడుదల ముంబయి: బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'స్త్రీ'. అమర్‌ కౌశిక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్‌ రావ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. ఒక ఊరిలో ఉన్నట్టుండి మగవాళ్లంతా మాయమైపోతుంటారు. వారు కన్పించకుండాపోయిన ప్రదేశంలో దుస్తులు లభ్యమవుతుంటాయి. తీరా చూస్తే వారిని కిడ్నాప్‌ చేస్తోంది ఒక స్త్రీ అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అందరికీ ఓ యువతిపై అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆమె కేవలం ఊర్లో జరిగే పండుగల సమయంలోనే కన్పిస్తుంటుంది. మిగతా సమయాల్లో ఎవ్వరికీ కన్పించదు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమెకు ఏం కావాలి? అన్నదే కథ.

ఇందులో స్త్రీ పాత్రలో శ్రద్ధా కపూర్‌ నటించారు. హార్రర్‌ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్రీకరణ మొత్తం మధ్యప్రదేశ్‌లోని చందేరీ ప్రాంతంలో జరిగింది. ఆగస్టు 31 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాతో పాటు శ్రద్ధా తెలుగులో 'సాహో' సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క హిందీలో 'బత్తి గుల్‌ మీటర్‌ చాలూ', ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లోనూ నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com