సౌదీ అరేబియాలో ఫిలిం ప్రొడక్షన్‌ కోర్స్‌

- July 27, 2018 , by Maagulf
సౌదీ అరేబియాలో ఫిలిం ప్రొడక్షన్‌ కోర్స్‌

జెడ్డా: జనరల్‌ అథారిటీ ఫర్‌ కల్చర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాతో కలిసి రియాద్‌లో ఫిలిం ప్రొడక్షన్‌ కోర్స్‌ని ప్రారంభించింది. దేశంలో టాలెంట్‌ని వెలికి తీసేందుకోసం, సినీ పరిశ్రమకు కొత్త ఊతమిచ్చేందుకు ఈ కోర్స్‌ ప్రవేశపెడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వారం రోజులపాటు జరిగే ఈ కోర్స్‌లో డైరెక్టర్స్‌ టూల్స్‌ మీదా, ఎక్స్‌ప్రెషన్స్‌ బేస్డ్‌ అప్రోచ్‌ మీదా, నటుల్ని డైరెక్ట్‌ చేయడంపైనా, ఇతరత్రా అనేక అంశాల గురించీ శిక్షణ వుంటుంది. జనరల్‌ అథారిటీ ఫర్‌ కల్చర్‌ - సౌదీ ఫిలిం కౌన్సిల్‌ ఇప్పటికే నిర్వహిస్తోన్న ట్రైనింగ్‌ కోర్సులలో ఇది కూడా ఓ భాగం. కింగ్‌డమ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com