సోహార్‌లో మహిళలు, పిల్లలకు స్పెషలైజ్డ్ హాస్పిటల్
- July 27, 2018
మస్కట్: సోహార్‌లో తొలిసారిగా ప్రైవేట్ హాస్పిటల్‌ని మహిళలు, పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఈ మేరకు టెండర్స్‌ని రిలీజ్ చేసింది. 70 పడకల ఈ ఆసుపత్రి ప్రత్యేకించి మహిళలు, పిల్లలకు వైద్య సహాయం అందిస్తుందని హెల్త్ కేర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ - ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ డాక్టర్ ఖాలిద్ ఎల్కోండాక్లీ చెప్పారు. మూడు ఆపరేటింగ్ రూమ్స్, పెద్దలకు అలాగే పిల్లల కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఈ ఆసుపత్రిలో వుంటాయి. తొమ్మిది లేబర్ మరియు డెలివరీ రూమ్స్, అత్యాధునిక నియోనాటల్ ఫెసిలిటీస్‌ని కూడా ఇందులో ఏర్పాటు చేస్తారు. ఇంటర్నల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆన్ కాల్ సర్జరీ టు ట్రీట్ ట్యూమర్స్ ఇన్ విమెన్, ఫిజియోథెరపీ వంటి సౌకర్యాలూ ఇక్కడ అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







