ప్రధాని చెప్పారు.. కేటీఆర్ ఆదేశించారు..మేయర్ చేసారు
- July 28, 2018
హైదరాబాద్: "స్థానిక సంస్థలు ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్లు బాండ్ల రూపంలో నిధులను సేకరించుకోవాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక చొరవ చూపించాలి" అని దేశ ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినప్పుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు సూచించారు. ప్రధాని సలహా మేరకు బాండ్ల ద్వారా నిధులను సేకరించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను సేకరిస్తోంది. ఇప్పటి వరకు కేవలం పూణె మున్సిపాలిటీ అనంతరం జీహెచ్ఎంసీ మాత్రమే బాండ్ల ద్వారా నిధులను సేకరించింది. అయితే పూణె బాండ్ల ద్వారా పూర్తిస్థాయిలో నిధులను సేకరించడంలో విఫలమైంది. జీహెచ్ఎంసీకి ఉన్న పటిష్టమైన ఆర్థిక వనరులు, ఆర్థిక క్రమశిక్షణ, ఆస్తుల నేపథ్యంలో లక్ష్యాన్ని మించి వెయ్యికోట్ల నిధులను బాండ్ల రూపంలో ఇవ్వడానికి ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ లో పలు ఆర్థిక సంస్థలు పోటీపడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టిన ఎస్ఆర్డీపీ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ వ్యయాలకు మాత్రమే ఈ బాండ్ల నిధులను వెచ్చిస్తున్నారు. జీహెచ్ఎంసీ విజయవంతంగా సేకరించిన బాండ్ల నిధులు దేశవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లకు మార్గదర్శకంగా నిలిచింది. ఇదే విషయాన్ని నేడు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో ప్రారంభమైన ట్రాన్స్ఫార్మింగ్ అర్భన్ ల్యాండ్ స్కేపింగ్ అనే అంశంపై రెండు రోజుల సదస్సు సమావేశంలో ప్రసంగించిన కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి హరిందర్పూరి పేర్కొన్నారు. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా జీహెచ్ఎంసీ బాండ్లను ప్రశంసించారు. ప్రజలపై ఏవిధమైన పన్నుల భారం వేయకుండా కేవలం వ్యవస్థాపరమైన లొసుగులను సరిదిద్దుకోవడం, ఐటి ఆధారిత సేవలను పటిష్టంగా ఉపయోగించుకోవడం ద్వారానే పన్నుల ద్వారా అధిక మొత్తంలో నిధులను జీహెచ్ఎంసీ సేకరిస్తోంది. సవాలుతో కూడుకున్న నగర నిర్వహణ మున్సిపల్ కార్పొరేషన్లు చేపట్టే స్వచ్ఛ కార్యక్రమాలలో నగర ప్రజల భాగస్వామ్యం పటిష్టంగా కల్పించినప్పుడే వాటి అమలు పకడ్బందీగా అవుతాయని జీహెచ్ఎంసీ భావిస్తోంది. బాండ్ల సేకరణకు గుర్తింపుగా కేంద్రం అందించిన ఈ ఇన్సెంటీవ్ దేశంలోనే ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు పలు మున్సిపాలిటీలు బాండ్ల సేకరణకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంవత్సరం ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా బాండ్ల రూపంలో నిధులను సేకరిస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







