కేటీఆర్‌తో నటుడు ప్రకాశ్‌రాజ్ భేటీ

- July 28, 2018 , by Maagulf
కేటీఆర్‌తో నటుడు ప్రకాశ్‌రాజ్ భేటీ

హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తో సినీనటుడు ప్రకాశ్‌రాజ్ భేటీ అయ్యారు. సమావేశం సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి అంశంపై ప్రకాశ్‌రాజ్ మంత్రితో చర్చించారు. ఈ గ్రామాన్ని ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామానికి కేటాయించిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై భేటీ సందర్భంగా చర్చించినట్లు ప్రకాశ్‌రాజ్ తెలిపారు. కొండారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేద్దామని కేటీఆర్ తెలిపినట్లుగా పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com