యు.ఏ.ఈ:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- July 28, 2018 , by Maagulf
యు.ఏ.ఈ:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

యు.ఏ.ఈ:60 ఏళ్ళ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన వాహనం టైర్‌ని మార్చే క్రమంలో ఆ వ్యక్తి వుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి, ఆ టైర్‌ మార్చడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నంలో వాహనం అతని మీద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని అల్‌ ధయిద్‌ మార్గ్యుకి తరలించారు. అల్‌ ధయిద్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పెట్రోల్‌, ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, అంబులెన్స్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నా అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com