అంజీరతో అదరగొట్టే శక్తి....
- July 30, 2018
మనం ప్రతి రోజు రకరకాల పండ్లు, కూరగాయలు తింటూ ఉంటాం. వీటిలో ఒక్కో దాని వల్ల ఒక్కొక్క ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. కాని అంజీర పండ్లలో మాత్రం ఎక్కువ ఔషధ గుణాలు, ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.దీనిని అత్తిపండు అని కూడా పిలుస్తారు. అంజీరలో విటమిన్ ఎ, బి6, సిలతో పాటు పొటాషియం, మాంగనీస్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, పైబర్, క్యాలరీస్, ప్రోటీన్స్ కార్బోహైడ్రేడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్రమంతప్పకుండా అంజీరను తీసుకోవటం వలన శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
1. అంజీరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువుగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవాళ్లు అంజీరను డైట్లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే పైబర్ తీసుకున్న ఆహారాన్ని తేలికగా జీర్ణం చేయడంతో పాటు మలబద్దక సమస్యను దూరం చేస్తుంది.
2. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి అంజీర చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
3. లైంగిక సామర్ధ్యాన్ని రెట్టింపు చేయడంలో అంజీర కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో ఉండే మోగ్నీషియం, జింక్, క్యాల్షియం బలహీనతను పోగొట్టి దాంపత్య జీవితం సుఖంగా సాగేందుకు దోహదపడుతుంది.
4. అంజీరలో ఒమోగా3 ప్యాటీ ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. ఇది చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేస్తుంది.
5. అంజీర శరీరంలోని ఇన్సులిన్ను క్రమబద్దీకరిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం చక్కెర నిల్వను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది. అంజీరను షుగరువ్యాధిగ్రస్తులకు చక్కటి వరం అని చెప్పవచ్చు.
6. అంజీరలో ఉండే క్యాల్షియం ఎముకలను ధృడంగా ఉంచుతుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా అంజీరను తినడం వలన పెళుసుగా మారిన ఎముకలు పుష్టిగా తయారవుతాయి. ఇందులో ఉండే పైబర్ ప్రేగులో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించి ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
7. అంజీర పండు పురుషలలో శృంగారేఛ్చను రెట్టింపు చేయడంతో పాటు సంతానలేమి సమస్యను దూరం చేస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







