చిన్నారిపై ట్రావెల్‌ బ్యాన్‌ ఎత్తివేతకు 20,000 బహ్రెయినీ దినార్స్‌ గ్యారంటీ

- July 31, 2018 , by Maagulf
చిన్నారిపై ట్రావెల్‌ బ్యాన్‌ ఎత్తివేతకు 20,000 బహ్రెయినీ దినార్స్‌ గ్యారంటీ

బహ్రెయిన్:బహ్రెయినీ చిన్నారిపై ట్రావెల్‌ బ్యాన్‌ని ఎత్తివేయడానికి వీలుగా లోవర్‌ షరియా కోర్ట్‌ 20,000 బహ్రెయినీ దినార్స్‌ గ్యారంటీగా చెల్లించాలని ఆ చిన్నారి తల్లికి ఆదేశించింది. చిన్నారి తండ్రి, తన కుమారుడ్ని దేశం బయటకు శాశ్వతంగా తన భార్య తీసుకెళుతోందని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ కేసులో విచారణ జరిగింది. 20,000 బహ్రెయినీ దినార్స్‌ విలువైన ప్రాపర్టీని ష్యూరిటీగా ఆ చిన్నారి తల్లి న్యాయస్థానానికి సూచించడంతో చిన్నారిపై ట్రావెల్‌ బ్యాన్‌ ఎత్తివేతకు మార్గం సుగమం అయ్యింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com