ఇండియాకు 'ఎస్‌టీఏ-1' హోదా ఇచ్చిన అమెరికా

- July 31, 2018 , by Maagulf
ఇండియాకు 'ఎస్‌టీఏ-1' హోదా ఇచ్చిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికా ఎగుమతి నియంత్రణలను సడలించింది. ఈ నేపధ్యంలో భారత్‌కు వ్యూహాత్మక వాణిజ్య అధికార దేశం-1(ఎస్‌టీఏ-1) హోదాను ఇచ్చింది. ఈవాణిజ్య శాఖ మంత్రి విల్‌బర్‌ రోస్‌ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య రక్షణ, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి' అన్నారు. ఈ జాబితాలో జపాన్‌, దక్షిణకొరియా లాంటి దేశాలు ఉన్నాయి. ఇప్పటివరకూ భారత్‌ ఎస్‌టీఏ-2 జాబితాలో ఏడు దేశాలతో కలిసి ఉంది. అమెరికా వాణిజ్యశాఖ వివరాల ప్రకారం ఎస్‌టీఏ-1 జాబితాలో ఉండే దేశాలు అమెరికా నుంచి జీవ రసాయన ఆయుధాలు, జాతీయ భద్రతకు సంబంధించిన ఉత్పత్తులు తదితరాలను దిగుమతి చేసుకోగలవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com