భారత గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది..
- August 02, 2018
అమెరికా:2019లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలంటూ భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానంపై అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించింది. భారత ప్రభుత్వం ఆహ్వానంపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. త్వరలోనే ట్రంప్ ఓ నిర్ణయానికి వస్తారని తెలిపింది. దీంతో ట్రంప్ భారత్‌కు వస్తారా?లేదా? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది.
'రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానం అందింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు' అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ సారా శాండర్స్ మీడియాకు చెప్పారు. త్వరలో అమెరికా-భారత్ మధ్య 2+2 వ్యూహాత్మక చర్చలు జరుగుతాయని, ఆ తర్వాతే ట్రంప్ భారత పర్యటనపై ఓ నిర్ణయానికి వస్తారని తెలిపారు. 2+2 చర్చల్లో పాల్గొనడటానికి సెప్టెంబర్‌లో అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు మైక్ పాంపెయో, జిమ్ మాటిస్‌లు భారతదేశాన్ని సందర్శిస్తారని సారా తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..