దుబాయ్:కారు నుంచి 51,500 దిర్హామ్‌లు దోచేసిన ముఠా
- August 02, 2018
దుబాయ్:ఆరుగురు సభ్యులుగల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్‌లో నిందితులు 51,500 దిర్హామ్‌లను ఓ కారు నుంచి దొంగిలించారు. ఆసియాకి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు నుంచి సొమ్ముని డ్రా చేసి, కారులో తీసుకెళుతుండగా, కారు టైర్ పంక్చర్ అయినట్లు గుర్తించారు. కారు టైర్‌ని మార్చే ప్రయత్నంలో బాధితుడు వుండగా, నిందితులు సమయం చూసి ఆ కారు నుంచి డబ్బుని దొంగిలించారు. బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేస్తున్న వ్యక్తిని గమనించి, అతని కారు టైర్‌ని పంక్చర్ చేసినట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. గతంలోనూ నిందితులు ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..