దుబాయ్‌:కారు నుంచి 51,500 దిర్హామ్‌లు దోచేసిన ముఠా

- August 02, 2018 , by Maagulf
దుబాయ్‌:కారు నుంచి 51,500 దిర్హామ్‌లు దోచేసిన ముఠా

దుబాయ్‌:ఆరుగురు సభ్యులుగల ముఠాని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దుబాయ్‌లో నిందితులు 51,500 దిర్హామ్‌లను ఓ కారు నుంచి దొంగిలించారు. ఆసియాకి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు నుంచి సొమ్ముని డ్రా చేసి, కారులో తీసుకెళుతుండగా, కారు టైర్‌ పంక్చర్‌ అయినట్లు గుర్తించారు. కారు టైర్‌ని మార్చే ప్రయత్నంలో బాధితుడు వుండగా, నిందితులు సమయం చూసి ఆ కారు నుంచి డబ్బుని దొంగిలించారు. బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేస్తున్న వ్యక్తిని గమనించి, అతని కారు టైర్‌ని పంక్చర్‌ చేసినట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. గతంలోనూ నిందితులు ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com