బ్రెస్ట్ మిల్క్ ప్రత్యామ్నాయాలపై ఉక్కుపాదం
- August 02, 2018
మనామా: పిల్లలకు పాలిచ్చే తల్లులే టార్గెట్‌గా కొందరు, బ్రెస్ట్ మిల్క్‌కి ప్రత్యామ్నాయమైన ప్రోడక్ట్స్‌కి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయత్నించడంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హెల్త్ అథారిటీస్ పేర్కొన్నాయి. ఇది చట్టవిరుద్ధమైన పని అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బహ్రెయిన్‌లో పలు కంపెనీలు, తమ రిప్రెజెంటేటివ్స్‌ని ఆసుపత్రులకు పంపి ఈ ప్రోడక్ట్స్ పట్ల తల్లులు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెల్త్ మినిస్ట్రీ, ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసింది. కంపెనీలను గుర్తించి చర్యలు తీసుకోవడం, కంపెనీల ప్రతినిథుల్ని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని అథారిటీస్ హెచ్చరించాయి. హాస్పిటల్‌లో ఈ తరహా ప్రచారం ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవనీ, పిల్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యల్నీ ఉపక్రమించేది లేదని హెల్త్ మినిస్ట్రీ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







