సిరియా పైన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న బాంబులవర్షం..
- December 14, 2015
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు లక్ష్యంగా సిరియా పైన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న బాంబుల వర్షానికి అమాయకులు కూడా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడుల్లో ఆదివారం నాడు ఒక్కరోజే 31 మంది చనిపోయారని మానవ హక్కుల సఘం పరిశీలకుడు రమీ ఆబ్దెల్ చెబుతున్నాడు. అంతకంటే ఎక్కువ ఉందని స్వచ్చంధ సంస్థలు చెబుతున్నాయి. తూర్పు ఘౌటా ప్రాంతంలోని ధౌమా, సక్భా పట్టణాల పైన సిరియన్, రష్యా దళాలు రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డాయి. ధౌమాలోని ఓ పాఠశాలలో వైమానిక దాడికి గురైంది. అందులోని ప్రధానోపాధ్యాయుడు చనిపోయాడు. చాలామంది గాయపడ్డారు. డమాస్కస్ పైన సిరియా ప్రభుత్వ దళాలు రాకెట్ లాంచర్లు, మోర్టారు షెల్స్‌తో దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఎన్నో భవనాలు నేలకొరిగాయి. చిన్నారుల హృదయ విధారక దృశ్యాలను స్వచ్ఛంద సంస్థలు ఫేస్బుక్లో పెట్టాయి. బాంబు దాడులతో సిరియాలో, యెమెన్‌లో ఎనభై మందికి పైగా మృతి చెందారు. మరోవైపు, ఐసిస్ ఉగ్రవాదులు రసాయ ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారా? అగ్ర రాజ్యాల పైన దాడులకు రసాయ ఆయుధాలు వినియోగించాలని ప్రణాళికలు వేసుకున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఐసిస్ అగ్రరాజ్యాలను కలవరపెడుతోంది. రసాయన ఆయుధాల తయారీ కోసం అవసరమైన నిపుణులను ఐసిస్ ఉగ్రవాదులు రిక్రూట్ చేసుకుంటున్నారని ఓ నివేదిక పేర్కొంది. కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగంలో నిపుణులను ఐసిస్ నియమించుకుంటోందని ఆ నివేదికలో వెల్లడైంది
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









