చంద్రబాబును ఆహ్వానించేందుకు కేసీఆర్..
- December 14, 2015
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. కేసీఆర్ తలపెట్టిన మహా చండీయాగానికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్న కేసీఆర్ కు ఏపీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, రావెల కిశోర్ బాబు స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ ఉన్నారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లి చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కేసీఆర్ విజయవాడ వెళ్లారు. కేసీఆర్ కోసం చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో 15 రకాల ఆంధ్ర వంటకాలను వడ్డించనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









