నాసా టీమ్‌లో సునీతా విలియమ్స్
- August 03, 2018
హూస్టన్: అగ్రరాజ్యం అమెరికా దాదాపు ఏడేళ్ల తర్వాత 2019లో మానవ సహిత అంతరిక్ష యాత్రలను చేపట్టనుంది. ఇందులో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సహా 9 మంది ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ప్రైవేటు కంపెనీ బోయింగ్ రూపొందించిన సీఎస్‌టీ–100 స్టార్ లైనర్, స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా వీరిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్‌ఎస్)కి వచ్చే ఏడాది ఆరంభంలో చేర్చనున్నారు. ఈ రెండు కంపెనీలు నాసా సహకారంతో ఈ అంతరిక్ష నౌకల్ని అభివృద్ధి చేశాయి. ఈ వివరాలను శుక్రవారం నాడిక్కడ నిర్వహించిన ఓ సమావేశంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాముల్ని, ఆహారపదార్థాలను చేరవేయనున్నారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టేముందు బోయింగ్, స్పేస్ ఎక్స్ సంస్థలు తమ నౌకల్ని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నాయి. అలాగే ప్రమాద సమయంలో వ్యోమగాములు రాకెట్ నుంచి సురక్షితంగా బయటపడేసే అబార్ట్ వ్యవస్థ సమర్థతను కూడా ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పరీక్షిస్తారు. 1972, జనవరి 5న మొదలైన స్పేస్ షటిల్ కార్యక్రమం 2011 నాటికి ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసా సరికొత్త అంతరిక్ష వాహక నౌకల అభివృద్ధిపై దృష్టి సారించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







