స్నేహితుల దినోత్సవం సందర్భంగా సోనాలి భావోద్వేగ ట్వీట్
- August 05, 2018
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్సర్‌తో న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కీమో థెరపీ నిమిత్తం తన జుట్టుని కూడా కత్తిరించుకుంది సోనాలి. అయితే కష్ట సమయంలోను ఎంతో ధైర్యంగా ఉంటున్న సోనాలిని ఎవరు అభినందించకుండా ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితులని వివరిస్తున్న సోనాలి ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడంతో పాటు ఈ సమయంలో తనకి అండగా ఉన్న స్నేహితులకి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సమయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విషయం గురించి చెప్పినప్పుడు ప్రజలు నన్ను వింతగా చూశారు. కాని అది నిజం.. ఎందుకో నేను చెబుతాను. ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉంటున్న నేను , సంతోషంగా ఉండేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. బాధ, లో ఎనర్జీతో కాలం గడుపుతున్నాను. కాని నచ్చిన వ్యక్తులతో కలిసి ఉండడం సంతోషంగా అనిపిస్తుంది. నేను ఈ పరిస్థితులలో ఉన్నానని తెలిసి, నాకు ధైర్యంగా నిలిచిన నా స్నేహితులకి కృతజ్ఞురాలిని. బిజీగా ఉన్న సమయంలోను వారి నా దగ్గరకి వచ్చి పలకరించడం లేదంటే కాల్, మెసేజ్ చేయడం గొప్ప విషయం. నన్ను ఒంటరిగా ఉండనివ్వకుండా వాళ్లు చూసుకున్నారు.
నిజమైన ఫ్రెండ్షిప్ ఏంటనేది వాళ్లు చూపించారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ లేడీస్. మీరు నా జీవితంలోకి వచ్చినందుకు నేను ధన్యురాలిని. ప్రస్తుతం నేను రెడీ అవడానికి చాలా తక్కువ సమయం తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు జుట్టు లేదు! అంటూ ఓ సరదా ఎమోజీతో ట్వీట్ పెట్టారు సోనాలి. ఈ ట్వీట్‌తో పాటు తన ఫ్రెండ్స్‌తో దిగిన పిక్‌ను జత చేశారు. అయితే ఈ పిక్‌లో మీకు తెలిసిన ఓ ఫ్రెండ్ లేరు అని కూడా రాసింది సోనాలి. అభిమానులు ఒకవైపు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుండగా, సోనాలి మధ్య మధ్యలో చేసే ట్వీట్స్ వారికి ధైర్యాన్ని ఇస్తున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







