రమ్యకృష్ణ 'రాణి శివగామి' ఫస్ట్‌లుక్

- August 05, 2018 , by Maagulf
రమ్యకృష్ణ 'రాణి శివగామి' ఫస్ట్‌లుక్

హైదరాబాద్ : తన అసమాన అభినయంతో ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి..నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకుంది ప్రముఖ నటి రమ్యకృష్ణ. ఇటీవల బాహుబలి సిరీస్ లో రాజమాత శివగామిగా అద్భుతమైన అభినయంతో పవర్‌ఫుల్ పాత్రలో అందర్ని అలరించిన ఈ సీనియర్ నటి ప్రధాన పాత్రలో రాణి శివగామి చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా తెలుగు ఫస్ట్ లుక్ ను బోనాల పండుగ కానుకగా చిత్రయూనిట్ విడుదల చేసింది. మధు మిణకన్ గుర్కి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్ పతాకంపై మురళీకృష్ణ దబ్బుగుడి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమా విశేషాలను నిర్మాత తెలియజేస్తూ.. రమ్యకృష్ణ నటిస్తున్న మరో పవర్‌ఫుల్ చిత్రమిది. ఆమెను కొత్తకోణంలో ఆవిష్కరించే ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. పీరియాడిక్ డ్రామా విత్ సోషియోఫాంటసీగా రూపొందుతున్నఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. త్వరలోనే ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. చిత్రాన్ని ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నమని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ.. తొమ్మిదవ శతాబ్ధంలో ప్రారంభమయ్యే ఈ కథ 21వ శతాబ్ధం వరకు కొనసాగుతుంది. ఈ కాలఘట్టంలో జరిగే సంఘటనలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి. తొమ్మిదవ శతాబ్ధానికి, 21వ శతాబ్దానికి ఉన్న సంబంధం ఏమిటనేది ఈ చిత్ర కథ. యుద్ద సన్నివేశాలు, గ్రాఫిక్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. శివగామిగా రమ్యకృష్ణ నటన చిత్రానికి ప్రధాన హైలైట్‌గా ఉంటుందన్నారు.

ఈ సినిమాలో రవికాలే, గోలీసోడా మధు, అవినాష్, ప్రవీణ్, పాయల్ రాధాకృష్ణ, రమేష్ పండిట్, కారుమంచి రఘు తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి సంగీతం: వీర్ సమ్రత్, కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: కెఎమ్ ప్రకాష్, ఆర్ట్: బాబుఖాన్, సహ నిర్మాతలు: దబ్బుగుంట వెంకటశేషయ్య యాదవ్, దబ్బుగుంట మహేష్‌కుమార్ యాదవ్, నిర్మాత: మురళీ కృష్ణ దబ్బుగుడి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మధు మిణకన గుర్కి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com