కోసం కొత్త సెట్ రెడీ చేసిన సైరా బృందం
- August 06, 2018
'సైరా' సినిమా సెట్‌ను షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు కూల్చి వేయడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ చర్యపై చిత్రబృందం ఎవ్వరు కూడా స్పందించకపోవడం కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సైలైంట్ గా చిత్రబృందం కొత్త సెట్ ని రెడీ చేసుకొనే పనిలో పడింది. ఇప్పుడా పని పూర్తయినట్టు సమాచారం.
కొత్త సెట్ లో రేపటి నుంచి షెడ్యూల్ మొదలుకానుంది. ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ఏకధాటిగా నెలరోజుల పాటు షూటింగ్ నిర్వహించనున్నారు. బ్రిటిషర్స్, నరసింహారెడ్డి మధ్య సాగే సన్నివేశాలు, ఫైట్స్ చిత్రీకరిస్తారని సమాచారం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.
ఇక, ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







