అమెరికాలో దాడి..సిక్కు వ్యక్తిని రాడ్‌తో కొట్టిన దుండగులు
- August 06, 2018
వాషింగ్‌టన్ : కాలిఫోర్నియాలో 50 ఏళ్ల సిక్కు వ్యక్తిపై ఇద్దరు అమెరికన్లు పలుమార్లు దాడిచేసి గాయపరిచారు. దేశం విడిచి వెళ్లిపోవాలని బెదిరించారు. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు ఆహ్వానించారు. మర్యాదగా అమెరికాను విడిచి వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. జాతి వివక్ష దాడిపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. కీస్ శివారు ప్రాంతంలో 50 ఏళ్ల సిక్కు వ్యక్తి ఒంటరిగా వెళుతుండగా ఈ ఘటన జరిగిందని, బాధితుడి తలపై నిందితులు రాడ్డుతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. అయితే, తలపాగా ఉండడంతో పెను ప్రమాదం నుండి ఆయన బయటపడ్డారని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి వెంటనే చికిత్స అందించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







