ప్రవాసులు స.హ.చ దరఖాస్తుకు అనర్హులు:జితేంద్రసింగ్
- August 08, 2018
ఢిల్లీ: సాధారణంగా ప్రభుత్వ పాలనా యంత్రాంగం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏదైనా సమాచారం కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రవాసులకు ఆ వెసులుబాటు లేదని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ లోక్‌సభకు ఇచ్చిన లిఖిత్వ పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 'సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం.. కేవలం భారతీయ పౌరులకు మాత్రమే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకునే హక్కు ఉంటుంది. ప్రవాసులకు ఇందుకు అర్హులు కారు' అని జితేంద్రసింగ్ తెలిపారు. అంతేగాక.. సహచట్టం ద్వారా సమాచారం పొందాలనుకునే వారికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉందని వెల్లడించారు. www.rtionline.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి అందులోని కావాల్సిన మంత్రిత్వ శాఖ లేదా ప్రభుత్వ విభాగాన్ని ఎంపిక చేసుకుని దరఖాస్తును నింపొచ్చని జితేంద్రసింగ్ తెలిపారు. ప్రస్తుతం 2,200 ప్రభుత్వ విభాగాల వద్ద ఈ ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించే వ్యవస్థ ఉందని చెప్పారు. ఈ దరఖాస్తులకు రుసుము కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని కేంద్రమంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







