ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవిగా రకూల్ ప్రీత్ సింగ్!
- August 09, 2018
క్రిష్ దర్శకత్వంలో వస్తున్న 'ఎన్టీఆర్'బయోపిక్ రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ని ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్ ను, రానాను, సచిన్ కేడెకర్ ను, మోహన్ బాబును ఎంపిక చేశారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో రకూల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తుందని ఆ మద్య వార్తలు వచ్చాయి. కానీ దర్శకులు క్రిష్ మాత్రం అవన్నీ కొట్టి పడేశారు. కానీ ఇప్పుడు ఒక్కో క్యారెక్టర్ రివీల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తుండగా శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ కనిపించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపించింది. శ్రీదేవి పాత్రకి ఆమె ఎంపిక ఖరారైపోయిందనేది తాజా సమాచారం. ఎన్టీఆర్ .. శ్రీదేవి కలిసి నటించిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందువలన ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రకి కూడా స్థానం వుంది.
ఈ పాత్ర కోసమే రకుల్ ను సంప్రదించడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయాయట. ఇక మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించబోతుంది. ఎన్టీఆర్ సీనీ కెరీర్ లో ఎక్కువ చిత్రాలు సావిత్రి, శ్రీదేవిలతో నటించిన విషయం తెలిసిందే.. అందుకే ఆ పాత్రలకు ఎంతో ప్రాధాన్య ఇస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







